జిల్లాలోని దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్‌గా ఉన్న ఎం దివాకర్‌నాయుడును పదవి నుంచి తొలగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్ తెలిపారు.
కప్పట్రాళ్ల సర్పంచ్‌గా దివాకర్‌నాయుడు తొలగింపు
Feb 15 2017 12:29 AM | Updated on Sep 5 2017 3:43 AM
కర్నూలు(అర్బన్): జిల్లాలోని దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్‌గా ఉన్న ఎం దివాకర్‌నాయుడును పదవి నుంచి తొలగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామానికి చెందిన పీ వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దివాకర్‌నాయుడుకు 2015 జనవరి 12న న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో పీఆర్ యాక్ట్ 1994 ప్రకారం ఆయనను పదవి నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇక నుంచి ఉప సర్పంచే తిరిగి ఎన్నికలు నిర్వహించేంతవరకు సర్పంచుగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు.
Advertisement
Advertisement