‘సాక్షి’ ఎరీనా వ¯ŒSస్కూల్ ఫెస్ట్ స్పెల్‌బీ ఇండియా సెమిఫైనల్స్ ఉభయగోదావరి జిల్లాల పరిధిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆదివారం జరిగింది. స్థానిక శ్రీ గౌతమీ స్కూలులో నాలుగు విభాగాలుగా జరిగిన ఈ సెమీఫైనల్స్ రెండు జిల్లాలనుంచి 22 స్కూ ల్స్‌కు చెందిన 157 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సాక్షి స్పెల్‌బీ 2016
-
ఉభయ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు హాజరు ∙
-
నాలుగు విభాగాల్లో సాగిన లైవ్ టీవీ ప్రశ్నావళి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
‘సాక్షి’ ఎరీనా వ¯ŒSస్కూల్ ఫెస్ట్ స్పెల్‌బీ ఇండియా సెమిఫైనల్స్ ఉభయగోదావరి జిల్లాల పరిధిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆదివారం జరిగింది. స్థానిక శ్రీ గౌతమీ స్కూలులో నాలుగు విభాగాలుగా జరిగిన ఈ సెమీఫైనల్స్ రెండు జిల్లాలనుంచి 22 స్కూ ల్స్‌కు చెందిన 157 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సాక్షి స్పెల్‌బీ 2016 రెండో రౌండ్‌లో విజేతలైన వారు సెమీఫైనల్స్‌కు హాజరయ్యారు. దీనిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. ’సాక్షి’ టీవీలో లైవ్‌లో చెప్పిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాశారు. కేటగిరి–1లో 22 మంది, కేటగిరి–2లో 35 మంది, కేట గిరి–3లో 34 మంది, కేటగిరి–4లో 56 మంది విద్యార్థులు రాశారు. టీవీ లైవ్‌లో బీ మాస్టర్ చెపుతున్న పదాలు...విద్యార్థులు దానికి పేపర్‌పై రాస్తున్న స్పెల్లింగ్‌ల క్రమంలో ఆ ప్రాంతమంతా పూర్తి నిశ్శబ్దతతో కూడిన ఉత్కంఠత కనిపించింది. దీనిని శ్రీగౌతమీ స్కూలు కరస్పాండెంట్ సుంకర రవి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ శాస్త్రి, సాక్షి బ్రాంచ్ మేనేజర్ వీవీ.శివుడు, సీనియర్ యాడ్ ఆఫీసర్ కె.ఉమాశంకర్ పర్యవేక్షించారు.
చాలా విలువైంది
స్పెల్లింగ్ కాదు...ఇది పదాల కలయికను చెబుతూ మాలో మంచి ఉత్సాహాన్నిస్తుంది. టీవీలో లైవ్ ద్వారా చెబుతుంటే ఆ పదాలను సరైన క్రమంలో రాయడం వల్ల మంచి నాలెడ్జ్ ఏర్పడుతుంది. ఇది చాలా ఉపయోగం.
– కొఠారి దివ్యజైన్, ఏడో తరగతి, ట్రిప్స్ స్కూలు.
ఇటువంటి పరీక్షల్లో తప్పక పాల్గొనాలి
‘సాక్షి’ నిర్వహించిన ఇటువంటి బుర్రకు పదునుపెట్టే పరీక్ష మాకు ఎంతో ఉపయోగం. తెలియని ఎన్నో పదాల అక్షరదోషాలు తెలుస్తాయి. ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది.
– వి.వంద్, ఆరో తరగతి, ట్రిప్స్ స్కూలు
మంచి జ్ఞానం సొంతం చేసుకోవచ్చు
స్పెల్‌బీ అంటే అన్ని స్కూల్స్ చాలా ఆసక్తిచూపుతున్నాయి. దానివల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తరగతుల్లో మంచి మార్కులు, విద్యలో ముందంజులో ఉండేందుకు తోడ్పడుతుంది.
– ప్రవీణ బదిరెడ్డి, హెచ్‌ఆర్, ఆదిత్య స్కూలు
మంచి పోటీ విధానం
మనలో అక్షర నైపుణ్యాన్ని పెంచే మంచి పోటీ . దీనివల్ల ముందు తరగతుల్లో మంచి ఫలితాలు సాధిస్తాము. ఇటువంటి పోటీల్లో అందరూ పాల్గొంటే పోటీ విధానంతో మంచి నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు.
– నల్లమిల్లి లక్ష్మి లేఖ్యారెడ్డి, ఆదిత్య స్కూలు
పిల్లలకు ఎంతో ఉపయోగం
ఈ పోటీ పరీక్షతో పిల్లల్లో మంచి ఆలోచనా విధానం పెరుగుతుంది. దీనివల్ల వారికి చదువులో ఎన్నో అక్షరపదాలు తేలికగా తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థులను ప్రోత్స హించే ఈ విధానం చాలా బాగుంది. ఇంకా ఇటువంటి పోటీ విధానాలు మరిన్ని తీసుకురావాలి.
– బత్సు హరిత, విద్యార్థి తల్లి, కాకినాడ