అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగర శివారులోని వంగపహాడ్ గ్రామానికి చెందిన గండు కొమురయ్య (60) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అతని కుమారుడు గండు రమేష్ స్థానికంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Sep 18 2016 12:51 AM | Updated on Nov 6 2018 8:04 PM
హసన్‌పర్తి : అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగర శివారులోని వంగపహాడ్ గ్రామానికి చెందిన గండు కొమురయ్య (60) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అతని కుమారుడు గండు రమేష్ స్థానికంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అందుకు కొమురయ్య అప్పులు తీసుకొచ్చాడు.
అప్పులు పెరిగిపోవడంతోపాటు డబ్బులు ఇచ్చిన వారు వేధింపులకు గురిచేశారు. దీంతో మానసిక వేదనకు గురైన కొ మురయ్య శుక్రవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగా డు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
Advertisement


