పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు మరోమారు సమ్మెబాట పట్టారు.
సమ్మెబాట పట్టిన ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు
Sep 3 2016 9:19 AM | Updated on Sep 4 2017 12:09 PM
నల్లగొండ: పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు మరోమారు సమ్మెబాట పట్టారు. గతంలో సమ్మెకు దిగినా అధికారులు స్పందించకపోవడంతో పాటు.. సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో శనివారం నుంచి మరోమారు సమ్మెకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 25 ప్లాంట్ల పరిధిలోని 800 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement