అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వల్ల ఓ గృహిణి రూ. 34 వేలు పోగొట్టుకుంది.
ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 34 వేలు దొచుకున్నారు
Aug 19 2016 7:03 PM | Updated on Oct 16 2018 3:12 PM
అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వల్ల ఓ గృహిణి రూ. 34 వేలు పోగొట్టుకుంది. కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎమ్ పిన్ నెంబర్ తెలుసుకొని అకౌంట్‌లోని రూ. 34 వేలను డ్రా చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో శుక్రవారం వెలుగచూసింది. స్థానికంగా నివాసముంటున్న గన్నె రమ్యకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాటల సందర్భంగా అతను ఏటీ ఎం పిన్ నెంబర్ అడగడంతో.. రమ్య అనాలోచితంగా తన ఏటీఎం పిన్ నెంబర్ చెప్పింది. కొద్ది సేపట్లోనే ఆమె అకౌంట్ నుంచి రూ. 34 వేలు డ్రా అయ్యాయని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె లబోదిబోమనుకుంటూ పోలీసులను ఆశ్రయించింది.
Advertisement
Advertisement