పేదరిక నిర్మూలనలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు.
పేదరిక నిర్మూలనలో బ్యాంకుల పాత్ర కీలకం
Jun 3 2017 11:45 PM | Updated on Mar 21 2019 8:19 PM
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు(అగ్రికల్చర్): పేదరిక నిర్మూలనలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు. స్వయం సహాయ సంఘాలకు, వృత్తి పనివారికి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. శనివారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కెనరా బ్యాంకులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాంకు ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబసభ్యులకు ప్రధానమంత్రి సురక్ష యోజన కింద రూ. 2 లక్షల విలువ చేసే చెక్‌లను అందచేశారు. స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కెనరాబ్యాంకు అసిస్టెంటు జనరల్ మేనేజర్ తిరపతయ్య, నంద్యాల చెక్‌పోస్టు బ్రాంచి మేనేజర్ లక్ష్మీనరసయ్య వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement


