చంద్రబాబుకు డాక్టరేటా? | roja questions: why chandrababu conferred with Doctorate by Chicago University | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు డాక్టరేటా?

Dec 17 2015 10:11 PM | Updated on Jul 28 2018 3:23 PM

చంద్రబాబుకు డాక్టరేటా? - Sakshi

చంద్రబాబుకు డాక్టరేటా?

ముఖ్యమంత్రిగా ఏం సాధించారని షికాగో యూనివర్సిటీ చంద్రబాబునాయుడుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఏం సాధించారని షికాగో యూనివర్సిటీ చంద్రబాబునాయుడుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. 19 నెలల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్ అని ధ్వజమెత్తారు. ఇలాంటి డాక్టరేట్‌లు ఇక్కడి పాలనలో మగ్గుతున్న ప్రజలు ఎలాగో ఇవ్వరు, అందుకే సప్త సముద్రాల అవతల ఉన్న వర్సీటీ నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వడంతో షికాగో విశ్వవిద్యాలయ స్థాయి ఇంతగా తగ్గిపోయిందా అన్న అనుమానం, బాధ కలుగుతోందని రోజా వ్యాఖ్యానించారు. మూడు వందలకు పైగా వాగ్దానాలు  చేసి ఏ ఒక్కటీ అములు చేయకపోవటం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏనాడూ కనీవినీ ఎరుగని సంఘటన అని అందుకే ఈ డాక్టరేట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement