ఆటో ఢీకొని వలస కూలీ మృతి | road accident kills ananthapur daily labour in banglore | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని వలస కూలీ మృతి

Jul 28 2015 6:53 PM | Updated on Jul 29 2019 5:43 PM

రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఆటో ఢీకొని అనంతపురం జిల్లాకు చెందిన వలసకూలీ మృతి చెందాడు.

అనంతపురం: రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఆటో ఢీకొని అనంతపురం జిల్లాకు చెందిన వలసకూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం బెంగళూరులో జరిగింది. వివరాలు.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం చెరుగండ్లపల్లి గ్రామానికి చెందిన చెరువు గంగిరెడ్డి బెంగళూరులో వలస కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం సొంతగ్రామం నుంచి తిరిగి బెంగళూరు వెళ్లాడు. కాగా, బెంగళూరులో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీ కొని తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం గంగిరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే, చికిత్స పొందుతూ గంగిరెడ్డి మంగళవారం మృతి చెందాడు. అతని మృతదేహన్ని బెంగళూరు నుంచి స్వగ్రామానికి తరలిస్తున్నట్లు బంధువులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement