రోడ్డు ప్రమాదం: తండ్రికొడుకులు మృతి | Road accident: dad, son died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: తండ్రికొడుకులు మృతి

Jul 23 2016 5:00 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదం: తండ్రికొడుకులు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదం: తండ్రికొడుకులు మృతి

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ తండ్రీకొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు ఈ విషాదకర సంఘటన మండల పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

⇒  అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..
⇒  బైక్‌ను ఢీకొన్ని గుర్తు తెలియని వాహనం..
⇒  పాల్మాకుల వద్ద ఘటన..

శంషాబాద్‌ రూరల్‌: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ తండ్రీకొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు ఈ విషాదకర సంఘటన మండల పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన గుర్రంపల్లి జంగయ్య(58) స్థానికంగా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జంగయ్య రెండో కొడుకు రమేష్‌ డ్రైవర్‌గా పని చేస్తూ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని జల్‌పల్లి ప్రాంతం శ్రీరానగర్‌ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తొండపల్లిలో వీరి దగ్గరి బందువు మృతి చెందగా.. అతని అంత్యక్రియల కోసం రమేష్‌ స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి జంగయ్యకు అనారోగ్యంగా ఉండడంతో నగరం తీసుకెళ్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని.. సాయంత్రం జంగయ్యను తీసుకుని రమేష్‌ బైక్‌పై జల్‌పల్లి వస్తున్నాడు.
          
        రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్‌ మండలంలోని పాల్మాకుల శివారులోకి రాగానే బెంగళూరు జాతీయ రహదారిపై వెనక నుంచి గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి ఎగిరిపడిన ఇద్దరికి తీవ్రగాయాలై సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా వారి ఆచూకి గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్థానిక క్లష్టర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శనివారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి,కొడుకు మృతితో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జంగయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, రమేష్‌కు భార్య, పాప ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement