వైభవంగా గంగమ్మ జాతర | Richely celebrate gangamma Festival | Sakshi
Sakshi News home page

వైభవంగా గంగమ్మ జాతర

Jul 17 2016 8:08 PM | Updated on Oct 1 2018 6:33 PM

వైభవంగా గంగమ్మ జాతర - Sakshi

వైభవంగా గంగమ్మ జాతర

మేళ్లచెర్వు: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

మేళ్లచెర్వు: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మంద గంపలు, బోనాలు ఎత్తుకోని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి, గంగమ్మ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పాలు పొంగళ్లు, బొనాలతో మెుక్కలు సమర్పించుకున్నారు. అనంతరం పోతురాజు వద్ద యాట పోతులను, కోడిపుంజులను బలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపిశెట్టి లక్ష్మమ్మ, తిరుపతి వెంకయ్య, మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు యాదవ్, వెంకటేశ్వర్లు, బసవయ్య, శ్రీను, గజ్జల శంకర్‌రెడ్డి, కొండారెడ్డి, బాల వెంకటరెడ్డి, కాకునూరి వెంకటరెడ్డి, సైదులు, కృష్ణయ్య, చంద్రయ్య, లింగయ్య, శంభయ్య, వీరయ్య, బక్కయ్య, కె.వెంకటేశ్వర్లు, ఎం.రాంబాబు, సోమయ్య, నర్సింహారావులు పాల్గొన్నారు.
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement