ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్సార్‌కేఆర్ విజయకుమార్ అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వాహణాధికారులు, ఇతర సిబ్బందితో సమీక్షించారు.
పెనుకొండ: ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్సార్‌కేఆర్ విజయకుమార్ అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వాహణాధికారులు, ఇతర సిబ్బందితో సమీక్షించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షలో 2015–16లో కార్పొరేషన్ నుంచి ఏఏ పథకాల క్రింద ఎంత గ్రాంటు మంజూరయ్యింది, ఏఏ జిల్లాలో ఎంత మేరకు ఖర్చు చేశారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా 2016–2017కి గాను చేపట్టాల్సిన ముఖ్య కార్యక్రమాలు, వాటికి సంబంధించిన నివేదికల తయారీ తదితర విషయాలపై ఆయన అధికారులతో కూలంకుషంగా చర్చించారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఈడి రాంనాయక్, కర్నూల్ జిల్లా ఈడి సుశేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.