రీసెర్చ్‌ మెథడాలజీ రూపకల్పన కీలకం | Research methodology formation is very important | Sakshi
Sakshi News home page

రీసెర్చ్‌ మెథడాలజీ రూపకల్పన కీలకం

Nov 29 2016 9:02 PM | Updated on Sep 4 2017 9:27 PM

రీసెర్చ్‌ మెథడాలజీ రూపకల్పన కీలకం

రీసెర్చ్‌ మెథడాలజీ రూపకల్పన కీలకం

పరిశోధనా గ్రంథం సమర్పించే అంశంలో రీసెర్చ్‌ మెథడాలజీ రూపకల్పన కీలకమని వీసీ ఆచార్య మహ్మద్‌ సాహెబ్‌ హుస్సేన్‌ అన్నారు.

టాంజానియాకు చెందిన ప్రొఫెసర్‌ హుస్సేన్‌
 
ఏఎన్‌యూ: పరిశోధనా గ్రంథం సమర్పించే అంశంలో రీసెర్చ్‌ మెథడాలజీ రూపకల్పన కీలకమని వీసీ ఆచార్య మహ్మద్‌ సాహెబ్‌ హుస్సేన్‌ అన్నారు. టాంజానియా దేశం ఎరిత్రియాకి చెందిన ప్రొఫెసర్‌ హుస్సేన్‌ మంగళవారం యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీ లా విభాగంలో జరిగిన కార్యక్రమంలో పరిశోధకులు, అధ్యాపకునుద్దేశించి ఆయన ప్రసంగించారు. రీసెర్చ్‌ మె£ýథడాలజీలో తప్పులు ఉంటే రీసెర్చ్‌ కాలమంతా వృథా  అవుతుందని, దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించాఽరు. పరిశోధనా గ్రంథంలో చాప్టరైజేషన్‌ చాలా ముఖ్యమని తెలిపారు. ఏఎన్‌యూ నుంచి వస్తున్న కొన్ని పరిశోధనా గ్రంథాల్లో చిన్నచిన్న తప్పులు ఉండటాన్ని తాను పరిశీలించానని అందుకే ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో లా విభాగాధిపతి ఆచార్య ఎల్‌. జయశ్రీ, డీన్‌ ఆచార్య వైపీ రామసుబ్బయ్య, విభాగానికి చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విదేశీ విద్యార్థులు  పాల్గొన్నారు. తొలుత హుస్సేన్‌కు ఏఎన్‌యూలో చదువుతున్న ఆఫ్రికా దేశాల విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement