ఎంబీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి | Release water for mb canal | Sakshi
Sakshi News home page

ఎంబీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి

Aug 28 2016 12:24 AM | Updated on Sep 4 2017 11:10 AM

ఎంబీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి

ఎంబీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి

మునగాల : సాగర్‌ ఎడమకాల్వ అనుబంధమైన ముక్త్యాల బ్రాంచ్‌ (ఎంబీ కెనాల్‌)కు పూర్తిస్థాయిలో 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చిలుకూరు మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు.

మునగాల : సాగర్‌ ఎడమకాల్వ అనుబంధమైన ముక్త్యాల బ్రాంచ్‌ (ఎంబీ కెనాల్‌)కు పూర్తిస్థాయిలో 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చిలుకూరు మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వారు మునగాల ఎడమకాలువ హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద ఉన్న ఎన్‌ఎస్‌పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇందుకు స్పందించిన సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలులేవని తేల్చి చెప్పారు. దీంతో అఖిలపక్ష నేతలు నేరుగా  సాగర్‌ ఉన్నతాధికారులతో ఫోన్‌ మాట్లాడారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు అంగీకరించడంతో ముక్త్యాల బ్రాంచ్‌ కాల్వ గేట్లను ఎత్తి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తరలించుకుపోయారు. ఈ కార్య క్రమంలో చిలుకూరు ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, జడ్పీటీసీ భట్టు శివాజీనాయిక్, సీపీఐ ఎంఎల్‌ నాయకులు వక్కంతుల కోటేశ్వరరావు, ఇతర నాయకులు గూడెపు శ్రీను, కంబాల శ్రీను, శేఖర్, సూర్యానారాయణ, అజయ్‌కుమార్, శంకర్, పాలకూరి బాబు తదితరులన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement