14 ఎర్రచందనం దుంగల స్వాధీనం | Red Sandle Seized | Sakshi
Sakshi News home page

14 ఎర్రచందనం దుంగల స్వాధీనం

Sep 24 2016 9:32 PM | Updated on Sep 4 2017 2:48 PM

14 ఎర్రచందనం దుంగల స్వాధీనం

14 ఎర్రచందనం దుంగల స్వాధీనం

14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం తెలిపారు.

ఖాజీపేట: 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఐ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్నం పైభాగాన ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తమిళ కూలీలు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్‌ఐ రంగారావు, సిబ్బంది దాడులు నిర్వహించారు. దుంగలను తీసుకెళ్తున్న 20 మంది తమిళ కూలీలు పరారయ్యారు. వారితోపాటు ఉన్న మిట్టా ఆదినారాయణరెడ్డి, మునగాల సుబ్రమణ్యం (సర్వర్‌ఖాన్‌పేట)ను అదుపులోకి తీసుకున్నారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిని విచారణ చేయగా, నాలుగు రోజుల క్రితం తమిళ కూలీలు కలిశారని తెలిపారు. దారి చూపితే డబ్బు ఇస్తామని చెప్పారన్నారు. తమిళ కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement