చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది.
నాగోలు: చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ కాశిరెడ్డి కథనం ప్రకారం.... నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓ కుటుంబం బైరామల్‌గూడలో నివాసముంటూ దుస్తులు అమ్ముకుంటూ జీవిస్తోంది. వీరికి కుమారుడు (13) సంతానం. వీరి ఇంటి పక్కనే ఉండే బాలిక (7) రెండో తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉన్న ఆ చిన్నారికి సదరు బాలుడు చాక్లెట్లు ఇస్తానని తన ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకొని, చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.