రామయ్యకు నిత్యకల్యాణం | ramayyaku nithya kalyanam | Sakshi
Sakshi News home page

రామయ్యకు నిత్యకల్యాణం

Jul 26 2016 11:10 PM | Updated on Sep 4 2017 6:24 AM

స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు చేశారు.

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నుంచి తీర్థజలాలను తీసుకువచ్చి భద్రుని ఆలయంలో అభిషేకం నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపానికి వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. అష్టోత్తర శతనామార్చన చేశారు. వేదమంత్రోచ్ఛారణల మ«ధ్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
  • ఆంజనేయస్వామికి అభిషేకం
శ్రీసీతారామచంద్రస్వామి వారికి అభిముఖంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న ఆంజనేయస్వామి వారికి మంగళవారం వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం గోదావరి తీర్థ జలాలను తెచ్చి, పంచామృతాలు, నారికేళజలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందన గంధాలను ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.  భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement