రామయ్యకు వైభవంగా నిత్య కల్యాణం | ramaiah nithya kalyanam | Sakshi
Sakshi News home page

రామయ్యకు వైభవంగా నిత్య కల్యాణం

Sep 28 2016 10:08 PM | Updated on Sep 4 2017 3:24 PM

స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులు

స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుడి గుడిలో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చుండబెట్టి ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. అనంతరం రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement