సీమాంధ్రకు వర్ష సూచన | rain movement in seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రకు వర్ష సూచన

Sep 6 2015 9:41 PM | Updated on Sep 3 2017 8:52 AM

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

విశాఖపట్నం: ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరో వైపు అసోం నుంచి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుకుదనం సంతరించుకున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది.

కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కూడా కురిసే అవకాశముందని ఐఎండీ తె లిపింది. అదే సమయం లో తీరంవెంబడి ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement