ర్యాగింగ్‌ హద్దులు దాటొద్దు | Raging should be in bounds | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ హద్దులు దాటొద్దు

Sep 28 2016 8:55 PM | Updated on Sep 4 2017 3:24 PM

విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న ప్రియ

విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న ప్రియ

కాలేజీ రోజుల్లో ర్యాగింగ్‌ సహజమని, అది శృతిమించి హద్దులు దాటకుండా ఆడ పిల్లలకు ధైర్యమిచ్చేదిగా ఉండాలని ‘ఈ జన్మనీకే’ చిత్రం హీరోయిన్‌ ప్రియ అన్నారు.

సిద్దిపేట జోన్‌: కాలేజీ రోజుల్లో ర్యాగింగ్‌ సహజమని, అది శృతిమించి హద్దులు దాటకుండా ఆడ పిల్లలకు ధైర్యమిచ్చేదిగా ఉండాలని ‘ఈ జన్మనీకే’ చిత్రం హీరోయిన్‌ ప్రియ అన్నారు. బుధవారం స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శివమ్స్‌ గార్డెన్‌లో జరిగిన ఫ్రెషర్స్‌ పార్టీలో చిత్రం హీరో తరుణ్‌, హీరోయిన్‌ ప్రియతో పాటు దర్శక, నిర్మాతలు కీర్తి కుమార్‌, జూలియస్‌, రవిచంద్రలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో గొప్పదన్నారు. కాలేజీ రోజులు తీపి గుర్తులని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ సభ్యులు శ్రీనివాస్‌, శరత్‌, సాగర్‌ , కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్యప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement