నల్లగొండ: ర్యాగింగ్ భూతం ఇంకా వదల్లేదు. గతంలో దాదాపు ప్రతీ కాలేజ్‌లోనూ కనిపించే ర్యాగింగ్ ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో కనిపిస్తోంది. నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫస్ట్‌యిర్ వైద్య విద్యార్థులను రెండో ఏడాది చదువుతున్న సీనియర్లు ర్యాగింగ్ చేశారు. జూనియర్ వైద్య విద్యార్థులు హాస్టల్‌లో ఉన్న సమయంలో ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అయితే దీనిపై జూనియర్ విద్యార్థులు.. సీనియర్ విద్యార్థులపై ప్రిన్సిపల్, వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇలా ఫిర్యాదు చేసినందుకు మళ్లీ జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. తమపైనే రిపోర్ట్ చేస్తారా అని మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై సీనియర్లను పిలిచి ప్రిన్సిపల్ మందలించారు. ప్రిన్సిపల్ మందలించిన తరువాత కూడా సీనియర్లు మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ర్యాగింగ్ ఘటన తొలుత గత నెల 31వ తేదీన చోటు చేసుకోగా, రెండోసారి నవంబర్ 4వ తేదీన కూడా జరగడంతో మెడికల్ కాలేజీలో భయాందోళనలు నెలుకొన్నాయి. వైద్య విద్యను అభ్యసించే వారే తోటి జూనియర్ స్టూడెంట్స్‌ను వేధింపులకు గురిచేయడం ఎంతవరకూ కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


