మోక్షం లేదా..!

రాళ్లు తేలి అధ్వానంగా ఉన్న కొట్టాలకు వెళ్లే రహదారి ,పొలాల్లో వెళుతున్న ఆర్టీసీ బస్సు (ఫైల్‌) - Sakshi


కొట్టాలకు వెళ్లేందుకు గతుకులుగా ఉన్న రోడ్డు

పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ విలీనానికి రాని ఆదేశాలు

పట్టించుకోని అధికారులు
కొట్టాల(రాజుపాళెం) :

గ్రామాల్లో ఉన్న పంచాయతీ రాజ్‌ రోడ్లకు మోక్షం కలగడం లేదు. ఎన్నో ఏళ్లుగా గతుకుల రోడ్లతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. అదే కోవలోనే రాజుపాళెం మండలంలోని కొట్టాల రోడ్డు ఉంది. ఈ రోడ్డును అభివృద్ధి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాదెగూడూరు నుంచి కొట్టాల గ్రామానికి పంచాయతీ శాఖ రాజ్‌ అధికారులు కొన్నేళ్ల కిత్రం తారురోడ్డును వేశారు. ఎనిమిదేళ్లుగా పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన ఈ రోడ్డుకు మరమ్మతులు లేదా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఆర్‌ఆర్‌ఎం గ్రాంటు కింద నిధులు మంజూరు చేసి టెండరు ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ టెండరును రద్దు చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ రోడ్డుకు నిధులు మంజూరు కాలేదు.విలీనానికి బ్రేక్‌:

ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు లేవని పం చాయతీ రాజ్‌ శాఖ చేతులెత్తేయడంతో.. ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి విలీనం చేసేందుకు ఉన్నతాధికారులకు ఇటీవల ప్రతిపాదనలు పంపిం చారు. వాటికి కూడా మోక్షం కలగలేదు. ఈ రోడ్డును గాదెగూడూరు నుంచి కూలూరు సమీపంలోని కుందూ నదిపై నిర్మించిన హైలెవెల్‌ వంతెన వరకు అనుసంధానం చేశారు. ఈ దారి అధ్వానంగా ఉండటంతో గతంలో ఆర్టీసీ బస్సును కూ డా రద్దు చేశారు. తిరిగి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారుల వద్దకు వెళ్లి బస్సును తిప్పాలని కోరడంతో వారు తిప్పుతున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా చాగలమర్రిలోని జాతీయ రహదారి 40కి ఈ రోడ్డు అనుసంధానంగా ఉంది. నిత్యం ఈ దారిలో రాకపోకలు జరుగుతుండేవి. అయితే గుంతలమయంగా మారడంతో కూలూరు మీదుగా వాహనదారులు వెళుతున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధి కారులైనా చొరవ తీసుకొని పంచాయతీ రాజ్‌శాఖలో ఉన్న ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీలోకి బదలాయించి అభివృద్ధి చేయాలని కొట్టాల గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ రోడ్డును మరిచారు

మా గ్రామానికి వెళ్లే కొట్టాల రోడ్డును అభివృద్ధి చేయడంలో అటు అధికారులు, ప్రజాప్రతినిధులు మరిచారు. బండ్ల బాట కన్నా అధ్వానంగా ఉండటంతో ఇబ్బందికరంగా ఉంది. రోజూ చాగలమర్రి, ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు ఈ రోడ్డే దిక్కు. ఏళ్లు గడస్తున్నా గుంతలు కూడా పూడ్చలేదు.    – నరసింహరెడ్డి, కొట్టాలనాగరికతకు దూరంగా..

ఆధునిక యుగంలో కూడా కొట్టాల గ్రామం వెనుకబడి ఉంది. ఎవరైనా గ్రామానికి వచ్చేందుకు కనీసం రోడ్డు కూడా బాగలేదు. ఇక్కడ ఒక గ్రామం ఉందని అధికారులకు, పాలకులకు తెలియదా? తెలిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదు. – రంగారెడ్డి, కొట్టాల

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top