చర్లలో గుట్కా విక్రయాలు | quid sales in Carla | Sakshi
Sakshi News home page

చర్లలో గుట్కా విక్రయాలు

Oct 14 2016 10:22 AM | Updated on Sep 4 2017 5:12 PM

చర్ల మండల కేంద్రంలో మళ్లీ గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

చర్ల మండల కేంద్రంలో మళ్లీ గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత రెండు నెలల క్రింత గుట్కా విక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు పలువురు విక్రేతలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. సరిగ్గా నెల తిరగక ముందే మళ్లీ చర్లలో గుట్కాల విక్రయాలు ఆరంభ కాగా ప్రస్తుత ముమ్మరంగా ఈ విక్రయాలు సాగుతున్నాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్, బస్టాండ్‌ సెంటర్, గాందీ సెంటర్, తహశీల్దార్‌ కార్యాలయం సెంటర్లలో గల పా¯ŒSషాపులలో వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చర్ల మండలంలో వీటి బారిన పడి పలువురు మృత్యువాత పడగా... మళ్లీ విచ్చల విడిగా సాగుతున్న ఈ గుట్కాల విక్రయాల వల్ల మళ్లీ ఎందరి ప్రాణాలు పోతాయోనని గుట్కా ప్రియులతో పాటు వాటి కుటుంబ సభ్యులు ఆందోళన  చెందుతున్నారు. చర్ల మండల కేంద్రంలో సాగుతున్న గుట్కాల విక్రయాలపై మళ్లీ పోలీసులు దృష్టి సారించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువరు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement