షాక్‌కు గురైన ఐస్‌క్రీమ్ షాప్ యజమాని
తర్వాత సవరించి రూ.63,550గా నమోదు
సూపర్‌బజార్ (కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లోని ఓ ఐస్‌క్రీమ్ షాప్‌నకు శనివారం రాత్రి విద్యుత్ బిల్లు తీయగా నెలకు రూ.12,35,191 వచ్చింది. ఇది చూసిన షాపు యజమాని అశోక్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గత నెలలో రూ.40,062 బిల్లు రాగా ఈనెల ఏకంగా రూ.12 లక్షలకు పైగా రావడంతో ఆదివారం విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో వారు బిల్లును సవరించి రూ.63,550గా నమోదు చేశారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా రూ.లక్షల్లో బిల్లు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత నెలలో రూ.40 వేల బిల్లు రాగా ఈనెల రూ.63,550 రావడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


