భారత గ్రోత్‌ ఇంజిన్‌గా తెలంగాణ | Telangana as India Growth Engine Says CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

భారత గ్రోత్‌ ఇంజిన్‌గా తెలంగాణ

Dec 8 2025 2:02 AM | Updated on Dec 8 2025 2:02 AM

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క

నిన్నటి వరకు ఒక లెక్క..‘సమ్మిట్‌’తర్వాత మరో లెక్క

కాంగ్రెస్‌ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘నేటి అవసరాలు తీర్చి..పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్టలేదు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి.. ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్‌ రీసౌండ్‌ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. భారత దేశ గ్రోత్‌ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్కం. తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ తర్వాత మరో లెక్క.

నిన్న, నేడు, రేపుం..మీ ఆశీర్వాదమే నా ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వంం. మీ సహకారమే నాకు సమస్తం. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకుం ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకుం తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఎక్స్‌’వేదికగా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం తన సందేశం ఇచ్చారు.

‘జాతి కోసం, జనహితం కోసంం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలిం. గొప్ప కార్యాలు చేయాలంటేం మహా సంకల్పం కావాలిం. సరిగ్గా రెండేళ్ల కింద నాకు ఆ ధైర్యం ఇచ్చిం తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చిం నిండు మనస్సుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు’అని సీఎం అన్నారు. రెండేళ్ల ప్రస్థానంలోం అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించినట్టు తన సందేశంలో తెలిపారు.  

రైతుకు దన్నుగా నిలుస్తాం 
గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని సీఎం రేవంత్‌ ఆ ట్వీట్‌లో వెల్లడించారు. ‘రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి అదానీ, అంబానీలాగా వ్యాపారరంగంలో నిలబెట్టాం’అని పేర్కొన్నారు. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామన్నారు.

చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని చెప్పారు. స్కిల్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. ‘జయ జయహే తెలంగాణ’అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement