ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమానును పుంగనూరు జడ్జి మోతీలాల్‌నాయక్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు.
ఎన్‌పీకుంట (కదిరి) : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమానును పుంగనూరు జడ్జి మోతీలాల్‌నాయక్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ముందుగా అమ్మవారిని సందర్శించుకొని, ఆతర్వాత అమ్మవారి ఘాట్ చుట్టూ ప్రదక్షిణ చేశారు. చెట్టు వద్ద కూర్చొని అమ్మవారి చరిత్ర, మర్రిమాను ప్రత్యేకతను గైడ్ అనిల్‌తో తెలుసుకున్నారు. ఏఎస్‌ఐ దేవీశ్రీ రమణ, కానిస్టేబుల్ విజయ్‌నాయక్ తదితరులు ఉన్నారు.