పంప్‌హౌస్‌లో సెక్యూరిటీ గార్డు గల్లంతు | pumphouse security guard missing | Sakshi
Sakshi News home page

పంప్‌హౌస్‌లో సెక్యూరిటీ గార్డు గల్లంతు

Jan 22 2017 11:42 PM | Updated on Sep 5 2017 1:51 AM

హంద్రీనీవా పంప్‌హౌస్‌–2లో సెక్యూరిటీ గార్డు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

నందికొట్కూరు: హంద్రీనీవా పంప్‌హౌస్‌–2లో సెక్యూరిటీ గార్డు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నందికొట్కూరు పట్టణానికి నాగేంద్ర అలియాస్‌ ఏసేపు(26) హంద్రీనీవా–2లో రెండేళ్ల నుంచి సెక్యూరిటీగార్డు పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు అడ్డాకుల నాగేశ్వరరావు, పుల్లమ్మ మృతి చెందారు. ఆదివారం..యువకుడు పంప్‌హౌస్‌లో  గల్లంతు కావడంతో  హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్(హంద్రీనీవా సుజల స్రవంతి) సిబ్బంది, ఎస్‌ఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని ఉదయం వరకూ ఏమీ తేల్చలేమని ఎస్‌ఐ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement