తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వాకదారిపేటలో ఉద్రిక్తత నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వాకదారిపేటలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఏర్పాటు చేయనున్న దివిస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తమ గోడు వినిపించుకోకుండా.. పరిశ్రమ నిర్మాణం చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగ్రహించిన గ్రామస్థులు పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో ఉన్న గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.