ప్రధాని దిష్టిబొమ్మ దహనం | primeminister body fire | Sakshi
Sakshi News home page

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

Jul 23 2016 8:41 PM | Updated on Apr 3 2019 5:32 PM

దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు - Sakshi

దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు

ఇల్లంతకుంట : బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై ఉత్తరప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్‌ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకులు శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ, దయాశంకర్‌సింగ్‌ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.

ఇల్లంతకుంట : బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై ఉత్తరప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్‌ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకులు శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ, దయాశంకర్‌సింగ్‌ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ శంకర్‌సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీకి ఉన్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కొంపెల్లి పర్శరాం, దేవరాజు, పెద్దొళ్ల శ్రీనివాస్, రవి, బాల్‌రాజు, శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, దేవయ్య పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement