తుంగభద్ర తీరం వెంబడి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు తహసీల్దార్ టీవీ రమేష్‌బాబు, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
Apr 22 2017 12:31 AM | Updated on Sep 5 2017 9:20 AM
కర్నూలు సీక్యాంప్: తుంగభద్ర తీరం వెంబడి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు తహసీల్దార్ టీవీ రమేష్‌బాబు, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలు మండలం పంచలింగాల, మునగాలపాడు వంటి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు చేసి ఓ ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్, సీఐ మాట్లాడుతూ నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Advertisement