ఘనంగా ఉగాది పురస్కారాల ప్రదానం
అడవికొలను (నిడమర్రు) : పాపోలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమం మండలంలోని అడవికొలను నం–2 పాఠశాలలో బుధవారం ఘనంగా జరిగింది.
అడవికొలను (నిడమర్రు) : పాపోలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమం మండలంలోని అడవికొలను నం–2 పాఠశాలలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి డి.మధుసూదనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ, టీవీ నటుడు వేటుకూరి నరసింహరాజుకు జీవన సాఫల్య అవార్డు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దూసంనపూడి సోమసుందర్‌కు సేవారత్న అవార్డును, ఆకాశవాణి వ్యాఖ్యాత ఏబీ ఆనంద్‌కు వాచకరత్న అవార్డును, డాక్టర్ కోనాడ ఆశోక్ సూర్యకు కళారత్న అవార్డును అందజేశారు. గురుదేవోభవ అవార్డులను ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ టీటీఎఫ్ రూజ్‌వెల్ట్, ఏలూరు మునిసిపల్ హైస్కూల్ హెచ్‌ఎం చించినాడ హరిబాబు, హెచ్‌ఎంలు జల్లా శ్రీరామచంద్రమూర్తి, కంచర్ల వెంకట రంగయ్య, పెదపాటి సోమశేఖర్, సనపల రాంబాబు, ఎంవీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌కు, నిడమర్రు ఎంఈవో పాశం పాండు రంగారావుకు ప్రత్యేక పురస్కారంను అందించారు.
తొలుత కార్యక్రమంలో డీఈవో మధుసూదనరావు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలు పాపోలు అప్పారావు, వీరాస్వామి సోదరులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు అని అన్నారు. పాపోలు సోదరులు పేద విద్యార్థులకు అందిస్తోన్న సేవలను దూసనపూడి సోమసుందరం కొనియాడారు. నిడమర్రు మండలాన్ని దత్తత తీసుకుని విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. జానపద హీరో నరసింహరాజు కూడా పాపోలు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉంగుటూరు, కొవ్వూరు శాసన సభ్యులు గన్ని వీరాంజనేయులు, కేఎస్ జవహర్, తాడేపల్లిగుడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనువాసు, ఫౌండేషన్ కార్యదర్శి చించినాడ సత్యకుమార్, ఏఎంవో సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.