బతుకు దెరువు కోసం వెళ్లి బలవన్మరణం | prabhavathi suicides in cheemakurthy | Sakshi
Sakshi News home page

బతుకు దెరువు కోసం వెళ్లి బలవన్మరణం

Jun 15 2017 11:44 PM | Updated on Sep 5 2017 1:42 PM

అనంతపురం జిల్లా తలుపుల మండలం సబ్బనగుంటపల్లికి చెందిన బూదలపల్లి ప్రభావతి(28) ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ జి.వి.చౌదరి తెలిపారు.

చీమకుర్తి రూరల్‌ : అనంతపురం జిల్లా తలుపుల మండలం సబ్బనగుంటపల్లికి చెందిన బూదలపల్లి ప్రభావతి(28) ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ జి.వి.చౌదరి తెలిపారు. ప్రభావతి కుటుంబం ఎనిమిదేళ్ల కిందట చీమకుర్తికి వలస వెళ్లారు. అక్కడి పవర్‌ ఆఫీస్‌ సమీపంలో నివాసముంటూ భర్త గ్రానైట్‌ క్వారీలో మెకానిక్‌ పని చేసేవాడు. వారికి ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. భర్త విధులకు వెళ్లగా తెల్లవారుజామున తాము నివాసముంటున్న రేకుల షెడ్డులోనే ఆమె చీరతో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. అనారోగ్యంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

పోల్

Advertisement