చీరాలలో పోలీసుల కార్టన్ సర్చ్ | police Search carton in Chirala | Sakshi
Sakshi News home page

చీరాలలో పోలీసుల కార్టన్ సర్చ్

Jul 11 2016 4:12 AM | Updated on Sep 4 2017 4:33 AM

ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ ఆదేశాల మేరకు స్థానిక ఆర్‌టీసీ గ్యారేజీ వద్ద ఉన్న ఆదినారాయణపురంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి...

* 20 మందిని అదుపులోకి  తీసుకున్న ఖాకీలు
* 20 వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలింపు

చీరాల రూరల్ : ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ ఆదేశాల మేరకు స్థానిక ఆర్‌టీసీ గ్యారేజీ వద్ద ఉన్న ఆదినారాయణపురంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు పోలీసులు కార్టన్ సెర్చ్ చేశారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 200 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటికి పోలీసులు స్వయంగా వెళ్లి ఇంట్లో ఎవరెవరు నివసిస్తున్నారు? ఇతర ప్రాంతాలకు చెందినవారు దొంగతనాలు, నేరాలకు పాల్పడి తలదాచుకునేందుకు ఏమైన వచ్చారా? అని ఆరాతీశారు.

పాత నేరస్థులు ఇళ్ల వద్ద ఉంటున్నారా.. లేదా.. ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్లారా, వెళితే ఎంతకాలం నుంచి ఇక్కడ ఉండటం లేదని నిశితంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 20 వాహనాలనూ పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement