ఏఎస్సై కేసులో పలువురు పోలీసులపై బదిలీ వేటు | police officials transfers in ASI mohan reddy case | Sakshi
Sakshi News home page

ఏఎస్సై కేసులో పలువురు పోలీసులపై బదిలీ వేటు

Nov 17 2015 9:15 AM | Updated on Aug 21 2018 7:26 PM

వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై మోహన్రెడ్డి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

కరీంనగర్: వడ్డీ వ్యాపారిగా మారి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై మోహన్రెడ్డి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీఐడీ మరింత వేగమంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. కోరుట్ల సీఐ సురేందర్, ముధోల్ సీఐ గణపతియాదవ్లను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శంకర్ సింగ్, కానిస్టేబుళ్లు నివాస్, శంకర్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కేటాయింపులు జరిగాయి. ఏఎస్ఐ మోహన్రెడ్డి ముఖ్య అనుచరులు పరశురాంగౌడ్, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వర్ల కోసం సీఐడీ అధికారులు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఏఎస్ఐ మోహన్రెడ్డి కేసుకు సంబంధించి ఆయనకు సహకరించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పోలీస్ అధికారులకు సీఐడీ ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత శనివారం జారీ చేసిన ఈ నోటీసులలో ఏఎస్పీ జనార్ధన్ రెడ్డితో పాటు మరో 30 మంది పేర్లను పేర్కొంది. ముగ్గురు డీఎస్పీలు బుచ్చి రాములు, భాస్కర్ రాజు, సాయి మనోహర్లకు, సీఐలు ప్రకాశ్, మల్లయ్యలకు నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement