పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్ | Police investigation without Passport : N.L.P Choudhury | Sakshi
Sakshi News home page

పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్

Aug 26 2016 1:45 AM | Updated on Sep 17 2018 6:26 PM

పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్ - Sakshi

పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్

పోలీసు విచారణతో సంబంధం లేకుండానే పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి. చౌదరి గురువారం ప్రకటించారు.

విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి  
మర్రిపాలెం (విశాఖపట్నం): పోలీసు విచారణతో సంబంధం లేకుండానే పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి. చౌదరి గురువారం ప్రకటించారు. సాధారణ పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే అభ్యర్థి దరఖాస్తు సమర్పించే సమయంలో ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, పాన్‌కార్డ్‌తో పాటు ఫారం ‘అనెక్సార్-ఐ’ను అదనంగా సమర్పించాలని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్) లేకుండానే పాస్‌పోర్ట్ జారీ చేస్తామన్నారు. అభ్యర్థి సమర్పించిన పత్రాలు ఆన్‌లైన్‌లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. దీనికి ఎటువంటి అదనపు ఫీజులు ఉండవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement