
'అమాయకులపై పోలీసు వేధింపులా... '
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు అమాయకులను వేధించడం సరికాదని విరసం నేత వరవరరావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు అమాయకులను వేధించడం సరికాదని విరసం నేత వరవరరావు అన్నారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరవరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా మున్సిపాలిటీకి చెందిన ధార సారయ్య కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు.
సారయ్య కుటుంబానికి ప్రాణభయం ఉందని, వారి కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని వరవరరావు అన్నారు. సారయ్య కుటుంబసభ్యులతో హోంమంత్రికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వరవరరావు..సారయ్య కుటుంబానికి న్యాయం చేయడం పట్ల ప్రభుత్వంపై తనకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు.