గోదావరిఖని, పెద‍్దపల్లిలో పోలీసుల తనిఖీలు | Police Cordon Search Operation In Karimnagar District | Sakshi
Sakshi News home page

గోదావరిఖని, పెద‍్దపల్లిలో పోలీసుల తనిఖీలు

Apr 23 2017 9:22 AM | Updated on Sep 5 2017 9:31 AM

గోదావరిఖని, పెద్దపల్లిలో ఆదివారం వేకువజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు

కరీంనగర్: గోదావరిఖని ఒకటవ పోలీస్‌ స్టెషన్‌ పరిధిలోని  7బి కాలనీ, విఠల్‌నగర్‌లో ఆదివారం వేకువజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, నాలుగు ట్రాలీ ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

సరైన అడ్రస్ తెలపని ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్‌ ఇన్‌స్పెక‍్టర్‌ కృష‍్ణ ఆధ‍్వర‍్యంలో సబ్‌ఇన్‌స్పెక‍్టర్లు, పోలీసులు ఈ తనిఖీల‍్లో పాల‍్గొన్నారు. అలాగే పెద్దపల్లి శాంతినగర్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement