శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు | police arrested HIV patient in west godavari district | Sakshi
Sakshi News home page

శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు

Feb 20 2016 8:59 AM | Updated on Sep 3 2017 6:03 PM

శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు

శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు

హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు.

ఏలూరు : హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి  చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా హెచ్‌ఐవీతో బాధపడుతున్నాడు.

అయినా వాస్తవాన్ని దాచిపెట్టి సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఒక యువతిని ఈ నెల 16న వివాహం చేసుకుని 18వ తేదీన(గురువారం)శోభనానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెనుగొండ పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో జయరామ్ ఇంటికి వెళ్లి శోభనాన్ని అడ్డుకుని నూతన వధువును కాపాడారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న వధువు బంధువులు అధికారులు, పోలీసులకు కృత జ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement