అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపులకు దిగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులపై వేధింపులు కొనసాగిస్తోంది.
అనంతపురం: అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపులకు దిగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులపై వేధింపులు కొనసాగిస్తోంది. ధర్మవరం చేనేత కార్మికుడి ఆత్మహత్యకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు మాధవనాగరాజు, రాఘవ కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో పోలీసుల చర్యలపట్ల వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వైఖరి సరైనది కాదంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. అక్రమ కేసులను ఎత్తివేయకుంటే ఆందోళన చేస్తామని కేతిరెడ్డి హెచ్చరించారు.