కవి వెంకటసుబ్బారావు కన్నుమూత | poet venkata subbarao passes away in ongole | Sakshi
Sakshi News home page

కవి వెంకటసుబ్బారావు కన్నుమూత

Oct 24 2016 6:02 PM | Updated on Sep 4 2017 6:11 PM

ప్రముఖ కవి, విరసం పతాక గేయకవి, నాటక రచయిత విప్లవ సాహిత్యంలో కీర్తి గడించిన వెలుగు వెంకట సుబ్బారావు(80) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.

చీరాల: ప్రముఖ కవి, విరసం పతాక గేయకవి, నాటక రచయిత విప్లవ సాహిత్యంలో కీర్తి గడించిన వెలుగు వెంకట సుబ్బారావు(80) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఆయన తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్యలో కీలకంగా వ్యవహరించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రజలకు అనేక సందేశాలిచ్చారు.

వెంకట సుబ్బారావు మరణం తెలుగుభాషోద్యమ సమాఖ్యకు, చీరాల ప్రజలకు తీరని లోటని సమాఖ్య చీరాల అధ్యక్షుడు జంపాల గంగాధరరావు పేర్కొన్నారు. సుబ్బారావు మృతదేహాన్నిసమాఖ్య ప్రతినిధులు అన్నంరాజు సుబ్బారావు, శ్రీనివాస్‌గౌడ్, సజ్జా వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement