తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తల్లి పాపమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తల్లి పాపమ్మ (105) మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం తల్లిని పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అనంతరం పాపమ్మ ఆరోగ్యంపై పోచారం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.


