బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్‌ | pink Run starts for Breast Cancer awareness | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్‌

Nov 12 2016 7:57 PM | Updated on Sep 4 2017 7:55 PM

బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్‌

బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్‌

బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన యువతి నీలిమ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకూ షూ, చెప్పులు లేకుండా పింక్‌రన్‌ను ప్రారంభించింది.

విజయవాడ (లబ్బీపేట) : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన యువతి నీలిమ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకూ షూ, చెప్పులు లేకుండా పింక్‌రన్‌ను ప్రారంభించింది. బందర్‌ రోడ్డులోని పీవీపీ మాల్‌ వద్ద శనివారం వేకువజామున 4 గంటలకు ఈ పరుగును ప్రారంభించిన ఆమె వారం రోజుల్లో విశాఖ చేరుకోనుంది. అక్కడ పింక్‌రన్‌–2016 పేరులో ఈనెల 20న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమని, సరైన అవగాహన లేకపోవడం వల్లే మహిళలు మృత్యువాత పడుతున్నారన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే షూ, చెప్పులు లేకుండా రన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.








 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement