ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నాం: మేకపాటి, గట్టు | people to live with pleasure | Sakshi
Sakshi News home page

ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నాం: మేకపాటి, గట్టు

Jul 31 2016 7:11 PM | Updated on Sep 4 2018 5:21 PM

తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

 తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గోషామహల్ ఆగాపురాలోని జై మహంకాళి దేవాలయాన్ని ఆదివారం వారు వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా జై మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

 

అనంతరం వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మెట్టు విజయ కుమార్, డాక్టర్ మెట్టు శ్రీకాంత్‌లు మేకపాటి రాజమోహన్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డిలను సత్కరించి, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, రాష్ట్ర కార్యదర్శి బి. బ్రహ్మానందరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వెంకట రమణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, నాయకులు ఇమాన్ హుస్సేన్, అభిలాష్, జాతీయ మత్స్య సమాఖ్య చైర్మన్ మెట్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement