డలతో మానసికోల్లాసం కలుగుతుందని చలపతి విద్యా సంస్థల అధినేత వైవీ ఆంజనేయులు తెలిపారు. మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న కార్పోరేట్ స్థాయి పట్వా ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లెవన్ వండర్స్ జట్టు విజేత
Jul 17 2016 10:24 PM | Updated on Mar 10 2019 8:23 PM
గుంటూరు రూరల్ : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని చలపతి విద్యా సంస్థల అధినేత వైవీ ఆంజనేయులు తెలిపారు. మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న కార్పోరేట్ స్థాయి పట్వా ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్ల నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికితీయడం అభినందనీయమని చెప్పారు. ఫైనల్ మ్యాచ్‌లో లెవన్ వండర్స్ జట్టు క్యాపిటల్‌రాక్స్ జట్ల మధ్య జరిగిన పోరులో టాస్ గెలిచిన క్యాపిటల్‌రాక్స్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లెవన్ వండర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన క్యాపిటల్‌రాక్స్ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లెవన్ వండర్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ పోటీలో మ్యాన్ ఆఫ్‌దిమ్యాచ్‌గా బుల్లిబాబు(లెవన్‌వండర్స్), మాన్ ఆప్‌ది టోర్నీగా రాము(లెవన్‌వండర్స్) నిలిచారు. అత్యధిక పరుగులు చేసి సిక్సర్లతో బాషా(గుంటూరు మారిమన్స్), అత్యధికS వికెట్లతో నాగమల్లేశ్వరరావు(లెవన్‌వండర్స్)లకు వైవీ ఆంజనేయులు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Advertisement
Advertisement