పద్మనాభరెడ్డి సేవలు మరువలేనివి

పద్మనాభరెడ్డి సేవలు మరువలేనివి

తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినగొప్ప వ్యక్తి సంకెపల్లి పద్మనాభరెడ్డి అని.. ఆయన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి సంతాపసభకు మంత్రి హాజరై నివాళులర్పించి మాట్లాడారు. పదవుల కోసం పాకులాడకుండా నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తి పద్మనాభరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, వేముల వీరేశం, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పాశం విజయయాధవరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎస్‌.రఘునందన్‌రెడ్డి, ఉప్పలయ్య, ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, మార్కెట్‌ కమిటీ వైస్‌చెర్మన్‌ యుగేంధర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌రెడ్డి, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

సంకెపల్లి మృతి..కాంగ్రెస్‌కు తీరని లోటు : ఎమ్మెల్సీ

మాజీ ఎంపీపీ సంకెపల్లి పద్మనాభరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం పద్మనాభరెడ్డి సంతాప సభకు హాజరైన అనంతరం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. తిరుమలగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, వ్యవసాయ మార్కెట్, వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు పద్మనాభరెడ్డి ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నియోజక ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, చెవిటి వెంకన్న యాదవ్, సంకెపల్లి కొండల్‌రెడ్డి, సీహెచ్‌ రాజగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, రాజయ్య, రాంబాబు, హఫీజ్, నరేష్, సోమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు కూడా హాజరై నివాళులర్పించారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top