పోర్టికో కూలి యువకుని దుర్మరణం | one died in accident | Sakshi
Sakshi News home page

పోర్టికో కూలి యువకుని దుర్మరణం

Aug 10 2016 11:39 PM | Updated on Sep 4 2017 8:43 AM

మతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు దాలయ్య, ఆదిలక్ష్మి

మతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు దాలయ్య, ఆదిలక్ష్మి

నిర్మాణంలో ఉన్న భవనం పోర్ట్‌కో కూలి యువకుడు మరణించిన సంఘటన జామిలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జామి : నిర్మాణంలో ఉన్న భవనం పోర్ట్‌కో కూలి యువకుడు మరణించిన సంఘటన జామిలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విదేశాల్లో ఉంటున్న బండారు సూర్యనారాయణ జామిలో గహ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి గహ నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనుల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం దీర్ఘాసి మణికంఠ (20) పోర్ట్‌కో డెకింగ్‌ తీస్తుండగా ఒక్కసారిగా పోర్ట్‌కో కుప్పకూలింది. దీంతో మణికంఠ సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. మతుడిది శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామం. నిరుపేద కుటుంబం కావడంతో తండ్రి∙దాలయ్యతో పాటు పనులకు వచ్చాడు. మతుడు ఇంటర్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఐటీసీ చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఆరు రోజుల కిందటే మణికంఠ పనిలోకి వచ్చి మత్యువాత పడ్డాడు.  కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు దాలయ్య, ఆదిలక్ష్మ కన్నీటి పర్యంతమయ్యాయరు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్‌. ఘని సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement