ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడెం వద్ద దారుణం చోటుచేసుకుంది.
ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడెం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఇటుకబట్టి కార్మికుల మధ్య ఓ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి ఒకరిని బలితీసుకుంది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతిచెందగా..ఒడిషాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.