క్రేన్‌ ఢీకొని వృద్ధురాలి మృతి | Old woman killed in road accident | Sakshi
Sakshi News home page

క్రేన్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

Sep 8 2016 1:10 AM | Updated on Aug 30 2018 4:07 PM

క్రేన్‌ ఢీకొని వృద్ధురాలి మృతి - Sakshi

క్రేన్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

కోళ్లమిట్ట (సూళ్లూరుపేట) :రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని క్రేన్‌ వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన పట్టణంలోని కోళ్లమిట్ట వద్ద బుధవారం జరిగింది.

కోళ్లమిట్ట (సూళ్లూరుపేట) :రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని క్రేన్‌ వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన పట్టణంలోని కోళ్లమిట్ట వద్ద బుధవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కోళ్లమిట్టకు చెందిన పుత్తూరు నాగమ్మ (60) షార్‌రోడ్డును దాటుతుండగా అదే మార్గంలో క్రేన్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే క్రేన్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్రేస్‌ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement