అబ్బాయికి 17, అమ్మాయికి 24 | officials stops child marriage | Sakshi
Sakshi News home page

అబ్బాయికి 17, అమ్మాయికి 24

Apr 22 2016 3:56 AM | Updated on Jul 12 2019 3:02 PM

అబ్బాయికి 17, అమ్మాయికి 24 - Sakshi

అబ్బాయికి 17, అమ్మాయికి 24

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మరో బాల్యవివాహానికి బ్రేక్ పడింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మరో బాల్యవివాహానికి బ్రేక్ పడింది. 17 సంవత్సరాల అబ్బాయికి, 24 ఏళ్ల అమ్మాయితో వివాహం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన కల్వకుర్తి మండలం గుండూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలుడికి (17), మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన యువతికి (24) గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరు కుటుంబాలతో మాట్లాడారు. అబ్బాయికి ఇంకా వివాహ వయసు రాలేదని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, 21 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయమని రాయించుకున్నారు.    - కల్వకుర్తి రూరల్

Advertisement
 
Advertisement
Advertisement