సార్లకు సమయపాలనే లేదు | Officers not following timing | Sakshi
Sakshi News home page

సార్లకు సమయపాలనే లేదు

Aug 20 2016 1:01 AM | Updated on Sep 4 2017 9:58 AM

సార్లకు సమయపాలనే లేదు

సార్లకు సమయపాలనే లేదు

చేజర్ల : చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి వేళకు రాకపోవడం షరామామూలే అయిపోయింది. దీంతో కార్యార్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్నీకావు.

ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోని ప్రభుత్వ కార్యాలయాలు 
ఇబ్బందులుపడుతున్న కార్యార్ధులు
చేజర్ల : చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి వేళకు రాకపోవడం షరామామూలే అయిపోయింది. దీంతో కార్యార్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్నీకావు. శుక్రవారం చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాలను విజిట్‌ చేయగా ఈ విషయం మరోమారు బయటపడింది. ఉదయం 10.30 గంటలైనా వెలుగు కార్యాలయం తలుపులు తీయలేదు. అదే సమయానికి వివిధ పనులపై ఈ కార్యాలయానికి అనేకమంది మహిళలు వచ్చారు. దీనిపక్కనే ఉన్న వ్యవసాయాధికారి కార్యాలయం తలుపులు ఉయదం 10:30 గంటలు దాటినా తీయలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ వివరాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలకోసం వచ్చిన రైతులు కార్యాలయం పక్కనే పడిగాపులుకాస్తూ కనిపించారు. మామూలుగా తహసీల్దార్‌ కార్యాలయం ఉదయం 7, 8 గంటల నుంచే కిటకిటలాడుతూ ఉంటుంది. సిబ్బంది వచ్చేసి ఉంటారు. అయితే చేజర్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 10 గంటలకు అక్కడ ఒక్కరు కూడాలేరు. వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు, విద్యార్థులు సర్టిఫికెట్లు వచ్చి ఎదురుచూశారు. వీఆర్వోల కోసం గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అయితే మధ్యాహ్నం 12 గంటలకు కూడా వస్తునేఉన్నారు. అధికారులు, సిబ్బందిలో చాలామంది బయటిప్రాంతాలకు చెందినవారు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రీక్‌ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement