హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌ | offender arrest in Murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

Jan 1 2017 10:42 PM | Updated on Sep 5 2017 12:08 AM

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలి పారు. శనివారం స్థానిక పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం

తాడేపల్లిగూడెం రూరల్‌ : యువకుడి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలి పారు. శనివారం స్థానిక పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కడకట్ల కొత్త బ్రిడ్జి వద్ద నివాసముం టున్న ముప్పిన చిరంజీవి అలియాస్‌ లడ్డూ (26) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని బ్రిడ్జి దిగువన పడేశారన్నారు. ఈ మేరకు మృతుని తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ మూర్తి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.  దీనికి సంబంధించి నిపుణులు సేకరించిన ఆధారాలతో దొమ్మర్ల కాలనీకి చెందిన పాత నేరస్తుడు కొమ్మిరెడ్డి నాగు అలియాస్‌ గణేష్‌ హత్యకు పాల్ప డినట్టు విచారణలో తేలిందన్నారు. పలు పోలీస్‌స్టేషన్లలో ఇతనిపై కేసులు ఉన్నాయని చెప్పారు. సమాచారం మేరకు నిందితుడు గణేష్‌ అతని ఇంటి వద్ద ఉండగా సీఐ మూర్తి అరెస్టు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తులో సీఐకు సహకరించిన పట్టణ ఎస్‌ఐలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, పో లీస్‌ సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement